బెల్లంకొండ సురేష్.. శరణ్‌ల వివాదానికి శుభంకార్డ్: కేసు వాపసు, ఆపై క్షమాపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆయన తనయుడు సాయిశ్రీనివాస్‌కు ఫైనాన్షియర్ శరణ్ కుమార్ క్షమాపణలు తెలిపారు. ఇటీవల తన వద్ద నుంచి రూ.85 లక్షలు తీసుకొని ఇవ్వలేదంటూ బెల్లంకొండ సురేశ్, సాయి శ్రీనివాస్‌లపై శరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో నాంపల్లి కోర్టు జోక్యంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినట్టు శరణ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు సీసీఎస్‌కు వచ్చిన శరణ్ కుమార్... సురేశ్, సాయి శ్రీనివాస్‌పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిని క్షమాపణలు కోరుతూ.. పెద్దల జోక్యంతో తమ మధ్య వివాదం ముగిసిందన్నారు. తమ అకౌంట్స్ సిబ్బందికి, బెల్లంకొండ మేనేజర్స్‌కు మధ్య సమాచార లోపం కారణంగానే ఈ వివాదం నెలకొందని శరణ్ కుమార్ స్పష్టం చేశారు. తమకు రావాల్సిన నగదులో కొంత ఇచ్చారని ఆయన వెల్లడించారు.
అంతకుముందు శరణ్ ఫిర్యాదుపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనతోపాటు తన కుమారుడిపై పెట్టిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. శరణ్ కుమార్‌ది మా వూరేనన్న ఆయన.. సినిమా టికెట్ల విషయమై అతడు తరచూ నాకు ఫోన్ చేసేవాడని చెప్పారు. అక్కడ ఉన్న డిస్టిబ్యూటర్లతో మాట్లాడి అతడికి ప్రతి వారం టికెట్లు అందేలా చేశానని... అలాంటి వ్యక్తి ఈరోజు మాపై కేసు పెట్టాడంటూ బెల్లంకొండ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శరణ్ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని...రూ.85 లక్షలు ఇచ్చినట్లు ఏదైనా సాక్ష్యాలు ఉంటే చూపించాలంటూ సురేశ్ సవాల్ విసిరారు. బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని.. శరణ్ వెనుక ఓ రాజకీయ నేత కూడా ఉన్నాడని బెల్లంకొండ ఆరోపించాడు. అతడే ఇదంతా చేయిస్తున్నాడని.. త్వరలోనే ఆ పెద్ద మనిషి ఎవరో మీ అందరికీ ఆధారాలతో సహా చెబుతానని సురేశ్ వెల్లడించారు. ఈ కేసులో నాతోపాటు తన కుమారుడు సాయిశ్రీనివాస్‌ని కూడా కావాలనే ఇరికించాడని బెల్లంకొండ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువరి మధ్య రాజీ కుదరడంతో వివాదం సద్దుమణిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout