బీజేపీకి మద్ధతిచ్చేది లేదు... అజిత్ పవార్ హద్దు మీరారు : శరద్ పవార్

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

మహా రాజకీయ పరిణామాలపై స్సందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ముంబైలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.... శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాయని స్పష్టం చేశారు. కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అజిత్ పవార్ వ్యతిరేకించారని... హద్దులు మీరారరని మండిపడ్డారు. బీజేపీకి మద్ధతు ఇచ్చేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని తెలిపారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే... శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సపోర్ట్ ఉందని... మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని వెల్లడించారు శరద్ పవార్.

కాగా బీజేపీకి మద్ధతిచ్చి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ పై వేటు పడినట్లు తెలుస్తోంది. ఆయనను ఎన్సీపీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.

More News

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం రిలీజ్ ఖ‌రారు

రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ట్రైలర్, సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.

అర్జున్ సురవరం ప్రి రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగా స్టార్

అర్జున్ సురవరం ... క్రైమ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 29న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్,

శివసేనకు అజిత్ పవార్ చెక్ ... ఫడ్నవీస్ దే మహాపీఠం

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలరోజులుగా చెలరేగిన దుమారం హై డ్రామాల మధ్య ముగిసింది. ప్రభుత్వ ఏర్పాటు పై అటు బీజేపీ ఇటు శివసేనల మధ్య జరిగిన రాజకీయ చదరంగంలో చివరికి బీజేపీ నెగ్గింది.

నటి గెహన వశిస్త్ కు గుండెపోటు.. కండీషన్ క్రిటికల్

టెలివిజన్ తార గెహన వశిస్త్ గుండె పోటుతో ముంబైలోని ఓ హాస్పిటల్ లో చేరారు. గందీ బాత్ వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన ఈ నటి....

చైతూకి రౌడీ బేబి బర్త్ డే విషెస్.. అక్కినేని ఫ్యాన్స్ ఫిదా

అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్.