బీజేపీకి మద్ధతిచ్చేది లేదు... అజిత్ పవార్ హద్దు మీరారు : శరద్ పవార్
Send us your feedback to audioarticles@vaarta.com
మహా రాజకీయ పరిణామాలపై స్సందించారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ముంబైలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.... శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాయని స్పష్టం చేశారు. కానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అజిత్ పవార్ వ్యతిరేకించారని... హద్దులు మీరారరని మండిపడ్డారు. బీజేపీకి మద్ధతు ఇచ్చేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని తెలిపారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే... శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సపోర్ట్ ఉందని... మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్నారని వెల్లడించారు శరద్ పవార్.
కాగా బీజేపీకి మద్ధతిచ్చి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ పై వేటు పడినట్లు తెలుస్తోంది. ఆయనను ఎన్సీపీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout