కొత్త ఇంట్లో ఆమెతో కలిసి అడుగుపెట్టిన షణ్ముఖ్.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
యూట్యూబ్, టిక్‌టాక్‌ల ద్వారా యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాపులారిటీతోనే ఆయన బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ అందుకున్నారు. టైటిల్ రేసులో తొలి నుంచి వినిపించిన పేర్లలో షణ్ముఖ్ కూడా ఒకరు. కానీ హౌస్‌లో షన్నూ తీరు , సిరితో మితిమీరిన చనువు కారణంగా ప్రేక్షకుల ఓటింగ్ పొందలేక రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గెలుపు అంచుల దాకా వచ్చి తృటిలో టైటిల్ మిస్ అయినప్పటికీ షణ్ముఖ్‌కు పారితోషికం మాత్రం గట్టిగానే ముట్టిందట. ఒక్క వారానికి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలను అందుకున్నట్లు టాక్. దీనిని బట్టి మొత్తం పదిహేను వారాలకు గానూ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
బిగ్‌బాస్ టైటిల్ పోయిందన్న బాధలో వున్న సమయంలోనే ఐదేళ్ల ప్రేమ బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించి దీప్తి సునయన బాంబు పేల్చారు. తర్వాత కూడా షణ్ముఖ్- దీప్తిలకు సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతూనే వచ్చాయి.
ఇక అసలు మేటర్లోకి వెళితే.. షణ్ముఖ్ ఇటీవల హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన షన్నూ.. తాజాగా గృహ ప్రవేశం చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. దీంతో షన్నూకి నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే ఛాయ్ బిస్కెట్ ఫేం, నటి శ్రీ విద్యతో కలిసి షణ్ముఖ్ కొత్త ఇంట్లో కాలు పెట్టడంపై తలో రకంగా స్పందిస్తున్నారు. మరోవైపు దీప్తి సునయనతో బ్రేకప్ అనంతరం ఇకపై కెరీర్‌పైనే దృష్టినట్లుగా కనిపిస్తున్నాడు షణ్ముఖ్. దీనిలో భాగంగానే ఆయన త్వరలోనే ఓ వెబ్‌సిరీస్‌తో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com