మద్యం తాగి మూడు వాహనాలను ఢీకొట్టిన షణ్ముఖ్ జశ్వంత్

  • IndiaGlitz, [Sunday,February 28 2021]

యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఫుల్లుగా మద్యం సేవించి అడ్డంగా బుక్ అయ్యాడు. షణ్ణు మద్యం తాగి కారు నడిపుతూ వేగంగా వెళ్లి మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ హుడా హైట్స్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షణ్ముఖ్‌ని అదుపులోకి తీసుకున్నారు.

షణ్ముఖ్ మద్యం మత్తులో కారు నడిపినట్టు తేలింది. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. 170 రీడింగ్ చూపించనట్టు పోలీసులు వెల్లడించారు. షణ్ముఖ్‌తో పాటు కారులో అతని మిత్రుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు షణ్ముఖ్‌తో పాటు అతడి స్నేహితుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే షణ్ముఖ్ కెరీర్ పరంగా ఎదుగుతున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 5లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పలు ఛానళ్లలో కొన్ని షోస్‌లో కూడా ఇటీవలి కాలంలో కనిపిస్తున్నాడు. ఈ సమయంలో ఇలా మద్యం సేవించి బుక్ అవడమంటే ఇది అతని కెరీర్‌కు కూడా ఇబ్బందికరంగా మారుతుందని పలువురు భావిస్తున్నారు.

More News

రాజకీయాల వల్ల ఎంతోమంది నష్టపోతారు: లావణ్య త్రిపాఠి

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కింది.

నాని రిజెక్ట్ చేసిన ప్రాజెక్టును ఓకే చేసిన వైష్ణవ్!

‘ఉప్పెన’ సినిమా లాక్‌డౌన్ తరువాత.. 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన అనంతరం విడుదలైన సినిమా.

పవన్ చిత్రంతోనే తిరిగి సినీ ప్రయాణం ప్రారంభిస్తున్నా: ఆనంద్ సాయి

యాదాద్రి ఆలయం నిర్మాణంలో ముఖ్యంగా మనల్ని ఆకర్షించేది డిజైన్. అద్భుతమైన శిల్పాలు మండపాలు, ప్రాకారాలు ప్రతిదీ చాలా రమ్యంగా, ఆసక్తికరంగా..

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా బాలయ్య ఇల్లు!

సినీ ఇండస్ట్రీలో ఎవరేం చేసినా విచిత్రమే. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుంది.

కన్నులపండువగా స్టార్‌ మా సండే

ఆదివారం రోజూ కన్నా కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలనిపిస్తుంది. ఎందుకంటే - రోజూ కంటే ఇంట్లో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది