వైజాగ్ బీచ్ లో శంకరాభరణం ట్రిఫుల్ ప్లాటినం
Send us your feedback to audioarticles@vaarta.com
నిఖిల్, నందిత జంటగా నటిస్తున్న చిత్రం శంకరాభరణం. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నందనవనం తెరకెక్కించారు. ఈ మూవీకి కోన వెంకట్ కథ, కథనం, స్ర్కీన్ ప్లే అందించారు. అంతే కాదు... చిత్ర సమర్పకుడు కూడా కోన వెంకటే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నారు. అయితే శంకరాభరణం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను వైజాగ్ ఆర్.కె.బీచ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు కోన టీమ్.
ఈ నెల 15న సాయంత్రం 6.30 ని.లకు ప్రారంభం అయ్యే ఈ ఫంక్షన్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొంటుంది. ఈ సినిమా పై అటు ఆడియోన్స్ లోను, ఇటు ఇండస్ట్రీలోను అంచనాలు ఉన్నాయి. మరి...ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది తెలియాలంటే డిసెంబర్ 4 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com