సర్ధార్ సెట్ లో..శంకరాభరణం
- IndiaGlitz, [Wednesday,October 14 2015]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. సర్ధార్ సెట్ లో పవన్ కళ్యాణ్ శంకరాభరణం టీజర్ ను రిలీజ్ చేసారు. శంకరాభరణం సినిమాకి స్టార్ రైటర్ కోన వెంకట్ కథ, కథనం, మాటలు అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
కోనకి పవన్ తో మంచి అనుబంధం ఉంది. ఆకారణంగానే పవన్ శంకరాభరణం టీజర్ ను రిలీజ్ చేసారు.ఈ మూవీలో నిఖిల్, నందిత జంటగా నటిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బీహార్ బ్యాక్ డ్రాప్ తో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న శంకరాభరణం చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పవన్ చేతుల మీదుగా శంకరాభరణం టీజర్ రిలీజ్ కావడంతో...ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి..శంకరాభరణం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.