చెన్నైబాధితులకు శంకరాభరణం టీమ్ సహాయం..
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నైనగరాన్నివణికిస్తున్నవర్షాల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్రజానికాన్ని ఆదుకునేందుకు టాలీవుడ్ నుంచి చాలా మంది సినీ తారలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా శంకరాభరణం టీమ్ కూడా ముందుకు వచ్చింది. తమ వంతు సాయంగా 5 లక్షల ఆర్ధిక సహాయం అందించనున్నట్టు ప్రకటించింది. చెన్నైలో సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఓ స్వచ్ఛంధ సంస్థ ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలియచేసారు. చెన్నైవర్ష బాధితులను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించామని హీరో నిఖిల్ చెప్పారు. శంకరాభరణం టీమ్ ఇలా తమ వంతు సహాయం చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments