'శంకరాభరణం' ఆడియో విడుదల
- IndiaGlitz, [Saturday,October 31 2015]
నిఖిల్, నందిత హీరో హీరోయిన్లుగా ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై కోనవెంకట్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం శంకరాభరణం'. హీరోయిన్ అంజలి కీలకపాత్రలో నటించారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ప్రవీణ్ క్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో పార్క్ హయత్ లో జరిగింది. అల్లు అరవింద్ ఆడియో సీడీను విడుదల చేసి తొలి సీడీని హీరోయిన్ సమంతకు అందజేశారు. పాటల్లో మంచి ఎనర్జీ కనపడుతుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని కళాతపస్వి కె.విశ్వనాథ్ అన్నారు.
ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూడగానే సినిమా ఎప్పుడు చూద్దామా అనే ఆసక్తి ఏర్పడింది. ప్రవీణ్ మంచి మ్యూజిక్ అందించాడు. డైరెక్టర్ ఉదయ్, నిర్మాత సత్యనారాయణ సహా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ అని అల్లు అరవింద్ అన్నారు. సినిమా పోస్టరే చాలా కొత్తగా ఉంది. కోనవెంకట్ తో మంచి అనుబంధం ఉంది. శంకరాభరణం సినిమా పెద్ద సక్సెస్ కావాలని వినాయక్ చెప్పారు. గీతాంజలి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిన దాని కంటే శంకరా భరణం' పెద్ద హిట్ కావాలి. అందరికీ ఆల్ ది బెస్ట్ అని సమంత అన్నారు.
సత్యనారాయణగారి సపోర్ట్ తో ఇంత మంచి సినిమా చేశాం. పవన్‌కళ్యాణగారు ట్రైలర్ విడుదల చేయడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే అంజలి కూడా అడగ్గానే మంచి రోల్ చేసింది. ఇద్దరికీ స్పెషల్ థాంక్స్. బాలీవుడ్ మూవీ ఫస్ గయా ఒబామా' సినిమా చూసి ఆ పాయింట్‌ను బేస్ చేసుకుని ఈ కథను అల్లాను. బీహర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కొత్తగా ఉంటుంది. సాయిశ్రీరాం ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించాడు. ఉదయ్‌ను ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నిఖిల్, నందితు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్‌కు థాంక్స్‌అని కోనవెంకట్ తెలిపారు.
ఈ సినిమాలో బందిపోటు రాణి పాత్రలో కనిపిస్తాను. నేను నటించిన సాంగ్ చాలా బాగా వచ్చింది. ప్రవీణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఉదయ్‌కు, సత్యనారాయణగారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అని అంజలి చెప్పారు. అందరూ సినిమా బాగుండాని బ్లెస్ చేసినందుకు థాంక్స్. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నవంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని నిఖిల్ తెలిపారు. మ్యూజిక్ బావుంది. ఉదయ్‌గారు సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. సపోర్ట్ చేసిన కోనగారికి, ఇతర టీమ్ సభ్యులకు థాంక్స్ అని నందిత అన్నారు.
కోనగారు బాగా కేర్ తీసుకుని చేసిన సినిమా. గీతాంజలి' కంటే పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అని నిర్మాత యం.వి.వి.సత్యనారాయణ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో భవ్య ఆనంద్ ప్రసాద్, వి.వి.వినాయక్, శ్రీవాస్, గోపింద్ మలినేని, అనీల్ సుంకర, మారుతి, సంపత్‌రాజ్, థమన్, బాబీ, దర్శకుడు ఉదయ్ నందనవనం, బాబా సెహగల్, జీవితా రాజశేఖర్, ప్రభాస్ శ్రీను, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని యూనిట్ ను అభినందించారు.