శంకర మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్ ప్రారంభం నుండి విలక్షణ చిత్రాల్లో నటిస్తూ మెప్పించిన నారా రోహిత్ హీరోగా రూపొందిన చిత్రం `శంకర`. భీమిలి కబడ్డి జట్టు, ఎస్.ఎం.ఎస్ వంటి రీమేక్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమా కూడా తమిళ చిత్రం మౌనగురుకు రీమేక్ కావడం గమనార్షహం. మరి ఈ సినిమా నారా రోహిత్‌కు ఎలాంటి సక్సెస్‌ను తెచ్చిపెట్టిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథః
శంకర్(నారారోహిత్) మధ్య తరగతికి చెందిన యువకుడు. తల్లి, అన్నయ్యలతో కలిసి ఉంటాడు. అన్నయ్య పంపిన డబ్బులతో హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. శంకర్‌కు తన కళ్ల ముందు జరిగే అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్తం ఉన్న శంకర్‌ను, అతని . శంకర్ వదిన చెల్లెలు, డాక్టర్ అయిన అమూల్య(రెజీనా) శంకర్‌ను ఇష్టపడుతుంది. అక్రమార్జనకు అలవాటు పడ్డ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్(జాన్ విజయ్) ఓ యాక్సిడెంట్లో దొరికిన డబ్బు కోసం కక్కుర్తి పడి ఓ నేరానికి పాల్పడతాడు. ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి వరుస నేరాలు చేస్తుంటాడు. తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమాయకుడైన శంకర్‌పై అభాండం వేసి జైలు పాలు చేయడమే కాకుండా పిచ్చివాడనే ముద్ర కూడా వేస్తాడు. అప్పుడు శంకర్ ఏం చేస్తాడు? కేసు నుండి ఎలా తప్పించుకుంటాడు? ఎసీపీ చివరకేమౌతాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణః
ఎప్పటిలాగానే ఈ సినిమా కూడా నారారోహిత్ స్టయిల్లో ఓ సీరియస్ మోడ్‌లో ఉంది. నారా రోహిత్ టైటిల్‌పాత్రలో చక్కగా యాక్ట్ చేశాడు. రెజీనా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. చెడ్డ ఎసీపీగా జాన్ విజయ్, అన్న పాత్రలో చిన్నా తదితరులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమా మెయిన్ కాన్సెప్ట్ బావుంది. దాని చుట్టూ అల్లిన అంశాలు ఆసక్తికరరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. అయితే స్లో నెరేషన్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. సాయికార్తీక్ సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమా ఎంటర్టైనింగ్ పంథాలో లేదు. సురేందర్ రెడ్డి కెమెరా పనితనం బావుంది. మంచి అధికారంలోని వ్యక్తుల తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చిన్నవారిపై నేరాలు మోపడం వల్ల వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాన్ని మౌనగురు అనే పేరుతో తెరకెక్కించి విడుదల చేశారు. తమిళంలో మౌనగురు పెద్ద విజయం సాధించడంతో తెలుగులో రీమేక్ చేశారు. సినిమా ఎప్పుడో పూర్తయిన కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు విడుదలైంది.
బోటమ్ లైన్ః శంకర...పరావాలేదనిపించాడు..
రేటింగ్ః 2.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com