దుబాయ్ లో ప్లాన్ చేస్తున్న శంకర్..

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మ‌రోసారి రోబో చిట్టిగా త‌న మాయాజాలాన్ని తెర‌పై చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే, ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల‌ను దుబాయ్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు యోచిస్తున్నార‌ట‌.