అప్పుడే శంక‌ర్ సినిమా ప్లాన్ చేసేస్తున్నాడుగా!

  • IndiaGlitz, [Monday,February 04 2019]

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాక‌ముందే మ‌రో సినిమాకు రంగం సిద్ధం చేసేసుకుంటున్నాడ‌ని త‌మిళ సినీ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళ హీరో విజ‌య్ కుమారుడు జాస‌న్ విజ‌య్, చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోలుగా ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేశాడ‌ట శంక‌ర్‌. ఇద్ద‌రు స్టార్ హీరోల కుమారుల‌తో సినిమా అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను శంక‌ర్ త‌న‌దైన శైలిలో డీల్ చేయ‌నున్నాడ‌నేది టాక్‌. అయితే ప్ర‌స్తుతం ఇండియ‌న్ 2కు తాత్కాలికంగా బ్రేక్ వేసిన శంక‌ర్‌.. వ‌చ్చే ఏడాది ఆ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడు.