2.0 షూటింగ్ పూర్తిః శంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `2.0`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శుభకరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోంది. అక్షయ్‌కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఎమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ముంబైలో చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.
ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్ మినహా మేజర్ షూటింగ్ పూర్తయ్యిందంటూ చిత్ర దర్శకుడు తన యూనిట్‌తో తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అ్రలెడి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సమాంతరంగా జరుపుకుంటుండం వల్ల దీపావళికి సినిమా విడుదల చేయడం పక్కా అని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments