‘అన్నియన్’ నిర్మాతకు డైరెక్టర్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై
Send us your feedback to audioarticles@vaarta.com
‘అన్నియన్’ రీమేక్ వివాదం ముదురుతోంది. ‘అన్నియన్’ మూవీని హిందీలో రీమేక్ చేస్తే లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆ చిత్ర నిర్మాత రవిచంద్రన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. తన అనుమతులు లేకుండా హిందీ రీమేక్ ఎలా చేస్తారంటూ రవిచంద్రన్ ఫైర్ అయ్యారు. అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఒరిజినల్ వెర్షన్ అన్నియన్ కథ తనకు సొంతమని రవిచంద్రన్ స్పష్టం చేశారు. ఈ మేరకు శంకర్‌కు ‘అన్నియన్’ నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్ మెయిల్ ద్వారా ఓ సందేశం పంపడం, దానికి శంకర్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవడం వంటివి.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి.
మెసేజ్‌కు శంకర్ కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. ఈ నెల 14వ తేదీన రవిచంద్రన్ పంపించిన మెయిల్ చూసి షాక్ అయ్యానన్నారు.'అన్నియన్' సినిమాకు సంబంధించిన హక్కులు రవిచంద్రన్ దగ్గర ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 2005లో విడుదలైన ఈ చిత్రం గురించి దీనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ తెలుసని.. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శంకర్ అని టైటిల్స్‌లో పడుతుందని వెల్లడించారు. ఈ చిత్ర కథ మొత్తం తనదేనని శంకర్ స్పష్టం చేశారు. రవిచంద్రన్.. సుజాత దగ్గర రైట్స్ తీసుకున్నానని చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం విషయంలో సుజాతకి ఎటువంటి సంబంధం లేదని శంకర్ తేల్చి చెప్పారు. కేవలం ఆమె డైలాగ్స్ విషయంలో మాత్రమే భాగమయ్యారని వెల్లడించారు.
ఈ సినిమాను ఎలా అయినా రీమేక్ చేసుకునే హక్కు తనకు మాత్రమే ఉందని శంకర్ స్పష్టం చేశారు. నిజానికి రవిచంద్రన్‌కు ఎటువంటి హక్కులూ లేవన్నారు. ఈ సినిమాతోనే మీకు నిర్మాతగా గుర్తింపు వచ్చిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇలా హక్కులు ఆయనవంటూ.. తన ప్రాజెక్ట్స్ ద్వారా గుర్తింపు పొందాలనుకోవడం దురదృష్టకరమన్నారు. తన వివరణ తర్వాత అయినా.. మీరు మీ బుద్ది మార్చుకుంటారని భావిస్తున్నానన్నారు. నిరాధారమైన వార్తలతో కోర్టులంటూ బెదిరించడం మానుకోవాలన్నారు. తన కెరీర్‌పై జరుగుతున్న ఇటువంటి అన్యాయమైన ఆరోపణలను ఖండిస్తూ.. ఈ వివరణ ఇస్తున్నాన ని శంకర్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout