శంకర్ మరో సీక్వెల్‌కు సిద్ధమయ్యాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటిన దర్శకుల్లో శంకర్ ఒకరు. సబ్జెక్ట్, టెక్నాలజీ పరంగా సినిమాను సరికొత్తగా పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్ తన మార్కు చూపించారు. అంతే కాదండోయ్.. సినిమా బడ్జెట్ పరంగానే భారీగానే రేంజును పెంచాడు. అయితే ఈ మధ్య కాలంలో ఈ స్టార్ డైరెక్టర్ తన డైరెక్షన్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్స్‌ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇటీవల కాలంలో రోబో సీక్వెల్‌గా 2.0 సినిమాను రూపొందించాడు శంకర్. అలాగే భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 సినిమాను రూపొందిస్తున్నారు.
దీని తర్వాత శంకర్ ‘ఒకే ఒక్కడు’ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కిస్తాడని వార్తలు వినిపించాయి. కానీ కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు తనను డైరెక్టర్‌గా పరిచయం చేసిన కె.టి.కుంజుమోన్ నిర్మాణంలో రూపొందిన జెంటిల్‌మేన్‌కు సీక్వెల్..జెంటిల్‌మేన్ 2 సినిమాను చేయబోతున్నాడట. నిర్మాత కుంజుమోన్ వివరాలు చెప్పలేదు కానీ.. జెంటిల్‌మేన్ 2 చిత్రాన్ని శంకరే డైరెక్ట్ చేయనున్నాడట. ఇందులో అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తాడని టాక్. సౌతిండియాలో ఓ స్టార్ హీరో ఈ సీక్వెల్‌లో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments