భారీ సెటప్ తో మొదలుకానున్న శంకర్, రాంచరణ్ మూవీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఆర్ఆర్ ముగియగానే మెగాపవర్ స్టార్ రాంచరణ్ మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: కళ్ళు చెదిరే ధరకు RRR ఆడియో రైట్స్!
ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. శంకర్ సినిమాలంటేనే భారీతనంతో ఉంటాయి. ఈ చిత్రాన్ని కూడా శంకర్ తన మార్క్ లోనే భారీ బడ్జెట్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ని శంకర్ ఓ భారీ సాంగ్ షూట్ తో ప్రారంభించబోతున్నాడట.
దీనికోసం హైదరాబాద్ లో కళ్ళు చెదిరే సెట్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికే ఓ పాటని కంపోస్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభించి 2022 సమ్మర్ లో సినిమా పూర్తి చేస్తానని శంకర్ దిల్ రాజుకు హామీ ఇచ్చారట.
ఎక్కువ గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో రాంచరణ్, శంకర్ మూవీ షూటింగ్ జరగనుంది. సోషల్ మెసేజ్, కమర్షియల్ అంశాలు కలగలసిన సాలిడ్ స్క్రిప్ట్ ని ఈ చిత్రం కోసం శంకర్ రెడీ చేశారు. ఇప్పటికే శంకర్, చరణ్, దిల్ రాజు చెన్నైలో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
రాంచరణ్ సరసన నటించే హీరోయిన్, ఇతర నటీనటుల్ని ఎంపిక చేయాల్సి ఉంది. ఇండియన్ 2 చిత్రం హోల్డ్ లో పడడంతో శంకర్.. రాంచరణ్ తో సినిమాకు సిద్ధమయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments