రోబో 2 టైటిల్ మారుస్తున్న శంకర్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన రోబో చిత్రం ఎంతటి సంచలనం స్రుష్టించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. డిసెంబర్ లో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి రోబో 2 అనే టైటిల్ కాకుండా ఇంటర్నేషనల్ స్ధాయిలో ఒకే టైటిల్ ఉండేలా వేరే టైటిల్ పెడితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట శంకర్. ప్రస్తుతం స్ర్కిప్ట్ పూర్తి చేసి నటీనటులను ఎంపిక చేస్తున్నాడు. 3డి ఫార్మెట్ లో ఇంటర్నేషనల్ స్ధాయిలో రూపొందే ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com