శంకరమహదేవన్ 'విమెన్ యాంథెమ్ సాంగ్' మహిళల కోసం జాతీయ గీతం...!
Send us your feedback to audioarticles@vaarta.com
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ. మహిళ వల్లనే జీవితం. ఈ జర్నీలో స్త్రీ పాత్ర గొప్పది. అలాంటి స్త్రీ కోసం ఓ గీతం ఉండాలని ఆలోచించడం.. అలా ఆలోచించి శంకర్ మహదేవన్ లాంటి ఓ టాప్ సింగర్‌తో పాడించడం నిజంగానే మెచ్చదగిన ప్రయత్నం. శంకర్ మహదేవన్ ఆలపనలో సుభాష్ సంగీతం అందించిన `విమెన్ యాంథెమ్ సాంగ్`ను హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో నేడు లాంచ్ చేశారు. ఈ పాటకు వివేక్ దర్శకత్వం వహించగా, రాహుల్ నిర్మించారు. మ్యాడ్ ఓవర్ ఫిలింస్ పతాకంపై రిలీజవుతోంది. సుభాష్ సంగీతం, థురాజ్ సాహిత్యం అందించారు. అరవింద్ సినిమాటోగ్రఫీ అందించారు. సాంగ్ లాంచ్ కార్యక్రమంలో `పెళ్లి చూపులు` నిర్మాత రాజ్ కందుకూరి, సాంగ్ డైరెక్టర్ వివేక్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ మాట్లాడుతూ - ``ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మ కాబట్టి.. మహిళ గొప్పతనాన్ని ప్రపంచానికి ఆవిష్కరించేలా ఈ పాట ఓ యాంథెమ్ ఉండాలని ప్రయత్నించాను. తురాజ్ చక్కని సాహిత్యం అందించారు. ఆశీస్సులు అందించిన పెద్దలకు థాంక్స్`` అన్నారు. వాస్తవానికి తొలుత మహిళలపై యాడ్ షూట్ చేయాలనుకున్నాం.. కానీ దానినే పాటగా మార్చాం. రత్నవేలు శిష్యుడు అరవింద్ సినిమాటోగ్రఫీ అందించారు. పాటే కథా అని లైట్ తీస్కోలేదు. ఎంతో కష్టపడి ఈ పాటను తెరకెక్కించాం. పదిరోజుల్లో పూర్తి చేయగలిగామని తెలిపారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ-`` ఆశుమన్‌కొచ్చు అనేది .. ఆడాళ్లను గౌరవించే పదం. విమెన్ పవర్‌ని ఎంకరేజ్ చేయాలని చెబుతుంటాను ఎపుడూ. ప్రస్తుతం నేను చేస్తున్న `మెంటల్ మది`లో చిత్రంలోనూ మహిళా ప్రాధాన్యత ఉంటుంది. విమెన్ పవర్‌ని ఎంకరేజ్ చేయడానికే నా టెక్నికల్ టీమ్‌లో గాళ్స్‌ని ఎంకరేజ్ చేశాను. గాయకుడు మహదేవన్ లెజెండ్.. ఆయన ఈ పాటను గొప్పగా ఆలపించారు. వివేక్, ఆనంద్, విజయ్ అందరికీ మంచి జరగాలి`` అన్నారు.
సుభాష్ మాట్లాడుతూ -`` ఆడవాళ్లు ఎంతో శ్రమిస్తారు. వారిని గౌరవించడం చాలా ముఖ్యం. జాతీయ గీతంకి ఎంత గౌరవం ఉందో, విమెన్ గీతంకి అంతే గౌరవం ఇవ్వాలి. నా భార్య విజయశ్రీ వద్దనే సినిమాటోగ్రఫీ నేర్చుకున్నా. గర్వంగా చెబుతున్నా..`` అని అన్నారు.
మహిళల్ని ఇంకా ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మహిళ అంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప అమ్మ. తర్వాత సిస్టర్స్, భార్య, పిల్లలు ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యం. దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోదగ్గది. వివేక్ త్వరలోనే డెబ్యూ మూవీతో వస్తున్నారు. శంకర మహదేవన్ అద్భుతంగా పాడారు.. `` అని రాహుల్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout