శంకరమహదేవన్ 'విమెన్ యాంథెమ్ సాంగ్' మహిళల కోసం జాతీయ గీతం...!

  • IndiaGlitz, [Thursday,July 13 2017]

మ‌న‌ల్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసేది అమ్మ‌. మ‌హిళ వ‌ల్ల‌నే జీవితం. ఈ జ‌ర్నీలో స్త్రీ పాత్ర గొప్ప‌ది. అలాంటి స్త్రీ కోసం ఓ గీతం ఉండాల‌ని ఆలోచించ‌డం.. అలా ఆలోచించి శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ లాంటి ఓ టాప్ సింగ‌ర్‌తో పాడించ‌డం నిజంగానే మెచ్చ‌ద‌గిన ప్ర‌య‌త్నం. శంక‌ర్ మ‌హదేవ‌న్ ఆలప‌న‌లో సుభాష్ సంగీతం అందించిన‌ 'విమెన్ యాంథెమ్ సాంగ్‌'ను హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్‌లో నేడు లాంచ్ చేశారు. ఈ పాట‌కు వివేక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, రాహుల్ నిర్మించారు. మ్యాడ్ ఓవ‌ర్ ఫిలింస్ ప‌తాకంపై రిలీజ‌వుతోంది. సుభాష్ సంగీతం, థురాజ్ సాహిత్యం అందించారు. అర‌వింద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. సాంగ్ లాంచ్ కార్య‌క్ర‌మంలో 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి, సాంగ్ డైరెక్ట‌ర్ వివేక్‌, సంగీత ద‌ర్శ‌కుడు సుభాష్ ఆనంద్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వివేక్‌ మాట్లాడుతూ - ''ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసేది అమ్మ కాబ‌ట్టి.. మ‌హిళ గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి ఆవిష్క‌రించేలా ఈ పాట ఓ యాంథెమ్‌ ఉండాల‌ని ప్ర‌య‌త్నించాను. తురాజ్‌ చ‌క్క‌ని సాహిత్యం అందించారు. ఆశీస్సులు అందించిన పెద్ద‌ల‌కు థాంక్స్‌'' అన్నారు. వాస్త‌వానికి తొలుత మ‌హిళ‌ల‌పై యాడ్ షూట్ చేయాల‌నుకున్నాం.. కానీ దానినే పాట‌గా మార్చాం. ర‌త్న‌వేలు శిష్యుడు అర‌వింద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పాటే క‌థా అని లైట్ తీస్కోలేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ పాట‌ను తెర‌కెక్కించాం. ప‌దిరోజుల్లో పూర్తి చేయ‌గ‌లిగామ‌ని తెలిపారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ-'' ఆశుమ‌న్‌కొచ్చు అనేది .. ఆడాళ్ల‌ను గౌర‌వించే ప‌దం. విమెన్ ప‌వ‌ర్‌ని ఎంక‌రేజ్ చేయాల‌ని చెబుతుంటాను ఎపుడూ. ప్ర‌స్తుతం నేను చేస్తున్న 'మెంట‌ల్ మ‌ది'లో చిత్రంలోనూ మ‌హిళా ప్రాధాన్య‌త ఉంటుంది. విమెన్ ప‌వ‌ర్‌ని ఎంక‌రేజ్ చేయ‌డానికే నా టెక్నిక‌ల్ టీమ్‌లో గాళ్స్‌ని ఎంక‌రేజ్ చేశాను. గాయ‌కుడు మ‌హ‌దేవ‌న్ లెజెండ్.. ఆయ‌న ఈ పాట‌ను గొప్ప‌గా ఆల‌పించారు. వివేక్‌, ఆనంద్, విజ‌య్ అంద‌రికీ మంచి జ‌ర‌గాలి'' అన్నారు.

సుభాష్ మాట్లాడుతూ -'' ఆడవాళ్లు ఎంతో శ్ర‌మిస్తారు. వారిని గౌర‌వించ‌డం చాలా ముఖ్యం. జాతీయ గీతంకి ఎంత గౌర‌వం ఉందో, విమెన్ గీతంకి అంతే గౌర‌వం ఇవ్వాలి. నా భార్య విజ‌య‌శ్రీ వ‌ద్ద‌నే సినిమాటోగ్ర‌ఫీ నేర్చుకున్నా. గ‌ర్వంగా చెబుతున్నా..'' అని అన్నారు.

మ‌హిళ‌ల్ని ఇంకా ఎంక‌రేజ్ చేసే ప‌రిస్థితి లేదు. మ‌హిళ అంటే ఈ ప్ర‌పంచంలో అన్నిటికంటే గొప్ప అమ్మ‌. త‌ర్వాత సిస్ట‌ర్స్‌, భార్య‌, పిల్ల‌లు ప్ర‌తి మ‌నిషి జీవితంలో చాలా ముఖ్యం. ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గ్గ‌ది. వివేక్ త్వ‌ర‌లోనే డెబ్యూ మూవీతో వ‌స్తున్నారు. శంక‌ర మ‌హ‌దేవ‌న్ అద్భుతంగా పాడారు.. '' అని రాహుల్ తెలిపారు.