రాజమౌళికి శంకర్ ప్రశంస

  • IndiaGlitz, [Tuesday,July 14 2015]

బాహుబలి వంటి విజువల్ వండర్ తో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ప్రేక్షకుల నుండే కాకుండా సినీ వర్గాల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. మూడు రోజుల్లోనే దాదాపు 160 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని ఫిలిం ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ కోవలోకి వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా చేరాడు. ప్రభాస్ సూపర్ హీరోయిజమ్, ఎపిక్ థాట్స్, పొయెటిక్ ఇమాజినేషన్, స్టన్నింగ్ విజువల్స్ తో బాహుబలిని విజువల్ వండర్ గా తీర్చిదిద్దడని శంకర్, రాజమౌళి అండ్ టీమ్ ని ప్రశంసలతో ముంచెత్తాడు.