ఫోర్ డీ.. అంటే ఏంటంటే?.. శంకర్ వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
`2.0` టీజర్‌ను శనివారం 4డీలో విడుదల చేశారు. 4డీ గురించి దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ``ఈ సినిమా కథను రాసేటప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు. కేవలం 4డీ సౌండ్ ని అందించడం మాత్రమే కాదు.. 4,5 స్టూడియోలో ఉన్న అన్నీ సిస్టమ్స్ ని ఆయన స్టూడియోకి తెచ్చారు.
ఈ సినిమా చూసిన తర్వాత మేం పడ్డ కష్టం అర్థమవుతుంది. ఎగ్జిబిటర్లకు నేను రిక్వస్ట్ చేసేది ఒక్కటే.. దయచేసి త్రీడీ థియేటర్లను ఎక్కువ చేయండి. ఈ సినిమా ఫుల్ ఎఫెక్ట్ తెలియాలంటే 4డీ సౌండ్ సిస్టమ్‌లోనూ, త్రీడీలోనూ చూస్తేనే అందుతుంది`` అని అన్నారు. జనీకాంత్, శంకర్ కాంబినేషన్ వచ్చిన `రోబో` సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం `2.0`. లైకా ప్రొడక్షన్స్, కరణ్ జోహార్ సమర్పణలో సుభాష్ కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు. ఎమీ జాక్సన్ హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments