'రంగస్థలం' సింగర్ తో 'శంభో శంకర' పాట

  • IndiaGlitz, [Monday,June 04 2018]

నాన్ 'బాహుబలి-2' రికార్డులు తిరగ రాసిన చిత్రం రంగస్థలం ఈ సినిమా కి ప్రాణంగా నిలిచిన రంగా రంగస్థలనా అంటూ సాగె టైటిల్ సాంగ్ ఈ ఏడాది టాప్ వన్ గా నిలిచింది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఆ తరువాత మళ్ళీ రాహుల్ సిప్లిగంజ్ శంకర్ హీరో గా రూపొందుతున్న శంభో శంకర

చిత్రం లో అమ్మ అమ్మోరు పాటను చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ ఎంతో అద్భుతం గా పండించారు ..ఈ పాటను సోమవారం ఉదయం రేడియో మిర్చిలో హీరో శంకర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శంకరతో పాటు నిర్మాతలలో ఒకరైన సురేష్ కొండేటి, రేడియో మిర్చి హేమంత్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

శంభో శంకర ద్వారా హీరో గా పరిచయం అవుతున్న శంకర్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఈ పాట సినిమా లో వస్తుంది ప్రముఖ గేయ రచయిత భాస్కర భట్ల రాసిన ఈ పాట లిరికల్ వీడియో సాంగ్ గా విడుదలై ఇప్పటికే ట్రేడ్ వర్గాలలో మంచి క్రేజ్ ను సంపాదించుకొంది. ఆర్.ఆర్.పిక్చర్స్ సంస్థ ఎస్.కె పిక్చర్స్ సమర్పణలో శ్రీధర్. ఎన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.రమణా రెడ్డి , సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు.. ఈ నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

More News

అతిథి పాత్ర‌తో హ్యాట్రిక్ కొడుతుందా?

'మ‌హాన‌టి'తో కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సావిత్రి పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు.. ఆమెకు న‌టిగా మంచి గుర్తింపును తీసుకువ‌చ్చింది.

'చినబాబు' టీజర్ కు అద్భుతమైన స్పందన

హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్ ను నిన్న సాయంత్రం  కార్తీ అన్న తమిళ్ స్టార్ హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది.

సెకండ్ షెడ్యూల్లో రానా చిత్రం .. టైటిల్ ఏంటంటే...?

కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు, వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న యువ క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి.

క్రీడాకారిణి బయోపిక్ ప్లాన్ చేస్తున్న మ‌హిళా డైరెక్ట‌ర్‌

తెలుగు ప్రేక్షకులకి బయోపిక్‌లు కొత్తేమీ కాదు. కాకపోతే.. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రిపై  ‘మహానటి’ రూపంలో  బయోపిక్ విడుదల కావడంతో..

'పందెం కోడి' త‌ర్వాత విశాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'అభిమ‌న్యుడు' - నిర్మాత గుజ్జ‌ల పూడి హ‌రి

300 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి...స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు గుజ్జ‌ల‌పూడి హ‌రి. హీరో విశాల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆయ‌న హీరోగా న‌టించిన రాయుడు