'శంభో శంక‌ర' డ‌బ్బింగ్ ప్రారంభం

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

శంక‌ర్ హీరోగా శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌క‌త్వంలో ఎస్. కె. పిక్చ‌ర్స్ సమ‌ర్ప‌ణ‌లో ఆర్.ఆర్ . పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న  'శంభో శంక‌ర‌' చిత్రం తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుంది. కాగా సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డ‌బ్బింగ్ ప‌నులు  ప్రారంభమ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల‌లో ఒక‌రైన ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ, ' షూటింగ్ అంతా అనుకున్న ప్ర‌కారం..అనుకున్న స‌మ‌యంలో పూర్తిచేసాం. టాకీ పార్టుతో పాటు, మూడు ఫైట్లు చాలా అద్భుతంగా వ‌చ్చాయి.  పాట‌ల‌న్నీ ఏటిక‌వి ప్ర‌త్యేకంగా ఉంటాయి. పాట‌ల చిత్రీక‌ర‌ణ చాలా బాగా జ‌రిగింది. ద‌ర్శ‌కుడు మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చారు' అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఎన్. మాట్లాడుతూ,  ' నాకిది తొలి సినిమా అయినా నిర్మాత‌లు స‌హ‌కారంతో అనుకున్న‌ది అనుకున్న‌ట్లు తీయ‌గ‌లిగాను. సాయి కార్తీక్ సంగీతం సినిమాకు హైలైట్ గా ఉంటుంది.  కొరియో గ్రాఫ‌ర్స్ భాను మాస్ట‌ర్, గ‌ణేష్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన పాట‌లు సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ఫైట్స్ మాస్ట‌ర్స్ జాష్వా, నందు కంపోజ్ చేసిన ఫైట్స్ ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా ఉంటాయి. ఆ ఫైట్స్ ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినిస్తాయి. సినిమా కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా  ఆక‌ట్టుకుంటుంది' అని అన్నారు.

మ‌రో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ' ఇప్ప‌టివ‌ర‌కూ క‌మెడీయ‌న్ గా అన్ని చిత్రాల్లో ప్ర‌ధాన భూమిక‌ను పోషించిన శంక‌ర్ న‌ట విశ్వ

More News

ఏప్రిల్ 13న 'నా పేరు సూర్య' 3rd సింగిల్ విడుద‌ల‌

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా".

'రంగ‌స్థ‌లం' స‌క్సెస్ మీట్ తేది ఖ‌రారు...

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ‌ఛరణ్ పెర్ఫామెన్స్‌.. సుకుమార్ టేకింగ్‌.. స‌మంత న‌ట‌న‌, దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇలా ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారంతో రూపొందిన చిత్రం 'రంగ‌స్థ‌లం'.

'భ‌ర‌త్ అనే నేను' ..ఆ సీన్స్ ఎంతో కీలకం

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘భ‌ర‌త్ అనే నేను’.

టీమ్‌కి మ‌హేశ్ బ‌హుమతి

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోచేసిన సినిమా `భ‌ర‌త్ అనే నేను`.

ర‌జ‌నీ చిత్రంలో మ‌రో బాలీవుడ్ విల‌న్‌?

సూపర్ స్టార్ రజనీ కాంత్, త‌మిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.