'శమంతకమణి' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, డా. రాజేంద్రప్రసాద్, ఇంద్రజ కీలకపాత్రల్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం `శమంతకమణి`. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. వి. ఆనందప్రసాద్ నిర్మాత. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
డిఫరెంట్ చిత్రమిది. నా క్యారక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. కొత్తగా ఉంటుంది. నా క్యారక్టర్ బాగా నచ్చడంతోనే సినిమా చేశాను. `బాణం`, `సోలో` తర్వాత మణిశర్మ సంగీతంలో చేస్తున్నాను. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నలుగురు హీరోలను ఒక తాటి మీదకు తీసుకొచ్చిన ఆనందప్రసాద్‌గారికి అభినందనలు అని నారా రోహిత్ చెప్పారు.ఇందులో ప్రతి పాత్ర బావుంది. అందుకే నాకు ఏ పాత్ర సూట్ అయితే దాన్నే ఇవ్వమని ఆప్షన్ దర్శకుడికి ఇచ్చాను. ఇది రెగ్యులర్ ఫార్ములాలో ఉండదు. చాలా కొత్తగా ఉండే స్క్రిప్ట్. నేను ఇందులో తల్లిని కోల్పోయిన వ్యక్తిగా నటిస్తున్నాను. ఎమోషన్ ఫ్యాక్టర్ ఉన్న క్యారక్టర్ నాది. నలుగురు హీరోలతో సినిమా చేయడమంటే ఇబ్బందే అని అనుకుంటున్న ఈ తరుణంలో దాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఈ టీమ్‌ది అని సుధీర్‌బాబు తెలిపారు.
సినిమా మొన్ననే స్టార్ట్ అయ్యింది. అప్పుడే అయిపోవస్తుంది. మంచి టీం కుదిరింది. మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వస్తోంది. మణిగారి సంగీతంలో నేను నటిస్తున్న రెండో చిత్రమిది. కార్తిక్ అనే లవబుల్ పాత్రలో నటిస్తున్నానని హీరో ఆది అన్నారు. టీజర్‌ని గెస్ చేయమని ఓ కాంటెస్ట్ ని రన్ చేశాం. త్వరలో మా నలుగురు హీరోలను ఒకచోట కలిపి ఫేస్‌బుక్ లైవ్ ద్వారా నలుగురిని ఎంపిక చేసి వారికి చెప్పినట్టే ఐ7 ఫోన్లను ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అందిస్తాం. ఈ సినిమా చేయడానికి వచ్చినప్పుడు శ్రీరామ్ ఆదిత్య చాలా మంచి కథ చెప్పారు. అందరూ చక్కగా నటించారు. జులై 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ చెప్పారు.
నేను తొలిసారి రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒక్కొక్కరితోనూ నాకు మంచి అనుభవం ఉంది. షూటింగ్ ఫాస్ట్ గా చేయడానికి సమీర్ రెడ్డి కెమెరాపనితనం కూడా తోడైంది. రాజేంద్రప్రసాద్‌గారు, సుమన్‌గారు, తనికెళ్లభరణిగారు, మణిశర్మగారు.. లాంటి సీనియర్లతో పనిచేయడం ఆనందంగా ఉంది. ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ చేస్తున్నారు. ఆనంద్‌ప్రసాద్‌గారు చాలా పాజిటివ్‌గా ఉండే నిర్మాత. అని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పారు.
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య .టి., నిర్మాత: వి. ఆనందప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ, మాటలు: వెంకట్ డి పాటి, అర్జున్ - కార్తిక్, శ్రీరామ్ ఆర్. ఎరగం, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: వివేక్ అన్నామలై, నృత్యాలు: రఘు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments