సెప్టెంబర్ 2న రానున్న 'శాలిని'
Send us your feedback to audioarticles@vaarta.com
స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్ లు గా పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్ సమర్పణలో పి. వి. సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ చిత్రం 'షాలిని'. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమయిన సందర్బంగా యూనిట్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు షిరాజ్ మాట్లాడుతూ ఈ చిత్ర ట్రైలర్, పాటలు ఇటీవలే విడుదలచేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఒక పల్లెటూరి నుంచి వచ్చిన యువతీ యవకులు సిటీ కు వచ్చినప్పుడు వారిక్కడ ఎలాంటి సమస్యలను భయాందోనళను ఎదుర్కొన్నారు వారిలో అసలు దెయ్యంగా ఉన్నది ఎవరు అనే ముఖ్య కతాంశం తో తెరకెక్కించాము. ఆడియోన్స్ ను థ్రిల్ కు గురిచేసే విధంగా ఉంటుంది కథ అంతా.. సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము అంటూ తెలిపారు. కన్నడ లో హీరో గా నటిస్తున్న షిరాజ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడం తో షాలిని చిత్రాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్నా... ఈ సెప్టెంబర్ 2న ఆంధ్ర తెలంగాణ అంతటా దాదాపు 80 నుంచి 100 థియేటర్స్ వరకు విడుదల చేసాయనున్నాము అని తెలిపారు నిర్మాత పి. వి. సత్యనారాయణ.
అనంతరం ఈ చిత్ర సమర్పకుడు లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ -- ఈ సినిమా లైన్ బాగుండటం తోనే సపర్పకుడిగా మారడం జరిగింది. షిరాజ్ ఈ చిత్రం తరువాత హీరో గా ప్రేక్షుకుల ముందుకు రానున్నారు, ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేర సెప్టెంబర్ 2 న విడుదల చేయనున్నాము, చాలా భయపెట్టే చిత్రం ఈ షాలిని. ఇటీవలే వైజాగ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాము మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కు కూడా అదే మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాము, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ కాస్త దయతో చిన్న సినిమాల కు థియేటర్లు ఇచ్చే సహకారాన్ని అందించాలని, ఈ విధంగా సహకారం అందిస్తే చిన్న సినిమాలు బ్రతుకుతాయని ఈ సందర్బంగా మనవి చేసుకుంటున్నా అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments