నాగశౌర్య జతగా షాలినీ!
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నమొన్నటిదాకా నిలిచి నిదానంగా సినిమాలు చేసిన అర్జున్‌రెడ్డి భామ ఇప్పుడు స్పీడు పెంచింది. మేఘ పాత్రలో '118'లో ఈ భామ కనిపించింది. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో షాలినీపాండేకు గోల్డెన్ లెగ్ క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఈ భామ నాగశౌర్య సినిమాకు సంతకం చేసింది. సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్‌మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయింది. మార్చి మూడో వారంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆల్రెడీ ఈ సినిమా కోసం గడ్డం పెంచి రఫ్‌గా కనిపిస్తున్నాడు నాగశౌర్య. పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రంలో ఓ డిఫరెంట్ కాన్ ఫ్లిక్ట్ ఉంటుందని సమాచారం.
ఈ సినిమా తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో శౌర్య కనిపిస్తారు. అవసరాల ఇంతకుముందు శౌర్యకు ఊహలు గుసగుసలాడేతో మంచి బిగినింగ్ ఇచ్చాడు. జో అచ్యుతానంద కూడా మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com