75 రోజుల షాలిని

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్లుగా షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్ సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వి. సత్యనారాయణ నిర్మించిన "షాలిని'' చిత్రం ఇటీవలే విడుదలై 75 రోజులు పూర్తీ చేసుకున్న సందర్బంగా హైద్రాబాద్ లో 75 రోజుల వేడుక నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆర్ కె గౌడ్, నిర్మాత సాయి వెంకట్, సీనియర్ నటి కవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం .. సాయి వెంకట్ మాట్లాడుతూ .. షాలిని సినిమా విడుదలై 75 రోజులు పూర్తీ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఒక చిన్న సినిమా 75 రోజులు ఆడడం మాములు విషయం కాదు. దర్శకుడు షెరాజ్ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల అవ్వడమే గగనం అవుతున్న సమయంలో ఓ చిన్న సినిమా ఏకంగా 75 రోజులు ఆడడం మాములు విషయం కాదు అన్నారు.

దర్శకుడు షేరాజ్ మాట్లాడుతూ .. షాలిని చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మా నిర్మాత సత్యనారాయణ పెట్టుకున్న నమ్మకం నిజం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న చిత్రానికి మీరు అందించిన సపోర్ట్ వల్లే ఇంత ఘానా విజయం దక్కింది. డిజిటల్ వ్యవస్థ వల్ల చిన్న సినిమాలకు పెద్ద దెబ్బగా మారె పరిసితి వచ్చిందని అన్నారు.

ఆర్కే గౌడ్ మాట్లాడుతూ . .. దర్శకుడు షెరాజ్ మంచి కథ కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు, ముక్యంగా ప్రమోషన్ విషయంలో అయన అవలంబించిన కొత్త విధానం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించిందని అన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు షెరాజ్ ను అభినందిస్తున్నాను అన్నారు.

సీనియర్ నటి కవిత మాట్లాడుతూ .. షాలిని సినిమా విజయం చిన్న సినిమాలకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. సినిమా బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసారు ప్రేక్షకులు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

More News

నచ్చినవారు నా సినిమా చూస్తే చాలు - సిద్ధార్థ్

సిద్ధార్థ్, వయూకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్టైన్మెంట్ బేనర్స్పై సిద్ధార్థ్, ఆండ్రియూ తారాగణంగా రూపొందిన హారర్ చిత్రం ’గృహం’. మిలింద్ రావ్ దర్శకుడు.

అవార్డులు ప్ర‌క‌టించిన వారంద‌రికి అభినంద‌న‌లు తెలియ‌జేసిన 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకుగాను నంది పురస్కారాలతోపాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను మంగ‌ళ‌వారం  ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

చలో టీజర్, మూవీ రిలీజ్ డేట్స్

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం","జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో... ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య.

'ఖాకి'లో కార్తి, రకుల్ కెమిస్ట్రీ

ఒక సినిమా హిట్ కావడానికి చాలా అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని సార్లు యాక్షన్, మరికొన్ని సార్లు కామెడీ.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్క జోనర్ అంశాలు పైచేయిగా నిలుస్తుంటాయి. అయితే ఎవర్గ్రీన్ విషయం, ఎవర్గ్రీన్గా యువ హృదయాలను కదిలించే అంశం రొమాన్స్.

ఏపీ ప్ర‌భుత్వం నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌భుత్వం 2014 నుండి 2016 వ‌ర‌కు నంది అవార్డుల ప్ర‌క‌టించింది. నంది అవార్డుల‌తో పాటు ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు, ర‌ఘుప‌తి వెంక‌య్య‌, బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించింది. మూడు ఏడాదిల‌కు క‌లిపి ఒకేసారి అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.Â