తనుశ్రీ వివాదం పై శక్తి కపూర్ వ్యంగ్యం
Send us your feedback to audioarticles@vaarta.com
2008లో జరిగిన ఓ డాన్స్ సీక్వెన్స్‌లో బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇటీవల బాలీవుడ్ తార తను శ్రీ దత్తా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీనిపై సోనం కపూర్, ట్వింకిల్ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, సిమీ గరేవాల్, అనురాగ్ కశ్యప్, పూజా భట్, రవీనా టాండన్, కొయినా మిత్రా సహా పలువురు తను శ్రీకి మద్ధతుని తెలిపితే.. అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్ వంటి వారు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు.
కాగా.. నానా పటేకర్ తనుశ్రీ పబ్లిసిటీ కోసం చవకబారు ఆరోపణలు చేస్తుందని తెలిపారు. తనుశ్రీకి లీగల్ నోటీసులు పంపారు. అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ ఈ ఘటనపై స్పందించిన తీరు నవ్వులు పూయిస్తుంది.
శక్తికపూర్ స్పందన కోరగా.. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన విషయం.. అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని... అంటూ శక్తి కపూర్ వ్యంగ్యంగా బదులివ్వడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com