Bigg Boss 7 Telugu : షకీలా ఎలిమినేట్.. అమ్మ పాటతో కంటతడి పెట్టించిన దామిని
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో , మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. తొలివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతందని అంతా భావించారు. చివరికి అదే నిజమైంది. నెక్ట్స్ లైన్‌లో వుంది ప్రిన్స్ యావరేనని అనుకున్నారు. దీనికి నెటిజన్లు చెప్పేది ఏంటంటే.. కిరణ్ రాథోడ్ మాదిరిగానే ప్రిన్స్‌కు కూడా తెలుగు రాదు. హౌస్‌లో వున్నన్న రోజులు తెలుగులోనే మాట్లాడాలన్న బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించాడు. దీంతో ప్రిన్స్ లేగజ్ సర్దేసేకుంటాడని అంతా భావించారు. కానీ దీనికి విరుద్ధంగా హౌస్‌లో అందరికీ అమ్మలా మారిన షకీలాను ఎలిమినేట్ చేసి షాకిచ్చాడు బిగ్‌బాస్.
ఈ వారం నామినేషన్స్‌లో వున్న అమర్‌దీప్, శివాజీ, ఆట సందీప్, ప్రియాంక, శుభశ్రీ, దామినిలు సేఫ్ సైడ్ వున్నారని బిగ్‌బాస్ ప్రకటించారు. షకీలా, ప్రశాంత్, గౌతమ్, ప్రిన్స్, తేజా, శోభాశెట్టి, రతికలు నామినేషన్స్‌లో వున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో నాకేం పట్టనట్లుగా వుండకూడదు. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలి, టాస్కుల విషయంలో గట్టి పోటీ ఇవ్వాలి. షకీల ఈ విషయంలో బాగా వెనుకబడి వుండటంతో ఓటింగ్‌పై ప్రభావం పడింది. ప్రేక్షకుల ఓట్లలో చివరి స్థానంలో వున్న షకీలాను ఎలిమినేట్ చేశారు బిగ్‌బాస్.
అంతకుముందు కంటెస్టెంట్స్‌కు ‘‘బిగ్‌బాస్ సామ్రాజ్యం’’ అంటూ టాస్క్ ఇచ్చారు నాగార్జున. దీని ప్రకారం ఇంటి సభ్యులు ఒక్కొక్కరు తమకు ఎవరు భల్లాలదేవ (విలన్), ఎవరు కట్టప్ప (వెన్నుపోటుదారు) అనేది చెప్పాల్సి వుంటుంది. దీంతో కంటెస్టెంట్స్ ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం రణధీర, మహబలి టీమ్‌ల మధ్య గెస్సింగ్ గేమ్ పెట్టారు. హీరోల కాస్ట్యూమ్స్ ఆధారంగా హీరో ఎవరు, ఆ సినిమా ఏంటో చెప్పాల్సి వుంటుంది. ఇందులో అనూహ్యంగా రణధీర టీమ్ ఓడిపోగా.. మహాబలి టీమ్ 8 పాయింట్లతో లగ్జరీ బడ్జెట్ గెలిచింది. ఎలిమినేషన్ ప్రాసెస్ చివరిలో టేస్టీ తేజ, షకీలా మిగలగా.. షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో తేజ, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, దామిని కంటతడి పెట్టారు.
అనంతరం స్టేజ్‌పై కంటెస్టెంట్స్ క్వాలిటీస్ చెప్పింది షకీలా. ప్రియాంక ఫ్రెండ్లీ నేచర్‌తో వుంటుందని, శివాజీ ఆనందం పంచుతూ, అందరూ హ్యాపీగా వుండాలని కోరుకుంటాని చెప్పింది. దామిని నమ్మకానికి కేరాఫ్ వంటిదని, రతిక సోల్ హార్టెడ్ అని ప్రశంసించింది. ఈ సందర్భంగా దామిని అమ్మ పాట పడి హౌస్‌ను ఏడిపించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments