షకలక శంకర్‌ హీరోగా 'ఖైదీ'!!

  • IndiaGlitz, [Friday,September 28 2018]

శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో షకలక శంకర్‌ హీరోగా హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ’ ఈ చిత్రం విజయదశమి కానుకగా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించుకోనుంది. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ పూర్తి చేసుకుందీ చిత్రం. కామెడీ,, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు గొలుసు మాట్లాడుతూ...‘‘చిరంజీవి గారి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’ .

అలాంటి గొప్ప సినిమా టైటిల్‌ తో ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు తేకుండా షకలక శంకర్‌ హీరోగా ‘ఖైదీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం’’ అన్నారు.

More News

విలక్షణ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(జె.పి.)కి ఫాస్‌-2018 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

గత 20 ఏళ్ళుగా సినీ, టి.వి., సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరిచిన కళాకారులను ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) ఘనంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 29న విశాల్‌ 'పందెం కోడి 2' ట్రైలర్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'.

'నాటకం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నాటకం'.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకుడు.

'ఐశ్వ‌ర్యాభిమ‌స్తు' మ్యూజిక్ లాంచ్‌

శ్రీమ‌తి వ‌రం మాధ‌వి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆర్య‌, విశాల్, సంతానం, త‌మ‌న్నా, భాను న‌టించిన చిత్రం 'ఐశ్వ‌ర్యాభిమ‌స్తు'.

'విశ్వదాభిరామ' ఫస్ట్ లుక్ లాంఛ్

చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వదాభిరామ'. సురేష్ కాశి, సురేంద్ర కమల్, అశోక్‌చక్రం దర్శకత్వం వహిస్తున్నారు.