Dalari:అన్నదమ్ముల కథ , వ్యవస్థలో లోపాలను టచ్ చేసే ‘‘దళారి’’ .. మరో బలగం అవుతుందన్న సినీ ప్రముఖులు
Send us your feedback to audioarticles@vaarta.com
రాజీవ్ కనకాల, షకలక శంకర్, శ్రీతేజ్, ఆక్సాఖాన్, రూపిక నటీనటులుగా కాచిడి గోపాల్‌రెడ్డి రచన దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్ రెడ్డి నిర్మించిన చిత్రం దళారి. అన్నదమ్ముల అనుబంధాలు, రాజకీయ నాయకులు, దళారిలు, బినామీల మధ్య జరుగుతున్న అంశాలను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించారు. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలను సైతం మేకర్స్ వేగవంతం చేశారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం 11.43 గంటలకు ‘‘అన్నదమ్ములను’’ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. పొలిమేర-2 ఫేమ్ సత్యం రాజేష్, రొడ్యూసర్ కోన వెంకట్, హీరో సునీల్ చేతుల మీదుగా రిలీజ్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ.. శంకర్ హీరోగా చేసిన సాంగ్ చాలా బాగుందని ప్రశంసించారు. ఒకరకమైన ఫీల్‌తో, పల్లెటూరి బ్యాగ్రౌండ్‌తో మంచి మ్యూజిక్ అందించారని, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని రాజేశ్ కోరారు. గోపాల్ రెడ్డి పెద్ద డైరెక్టర్ అవుతారని, ప్రొడ్యూసర్‌కి మంచి లాభాలొస్తాయని ఆయన ఆకాంక్షించారు. కోన వెంకట్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక హాట్ టచింగ్ సాంగ్‌ను సుద్దాల అశోక్ తేజ రాశారని, ఈ పాట చాలా డెప్త్ ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. కథేంటో తలియకుండానే ఒక ఎమోషన్‌లోకి తీసుకెళ్ళారని.. ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా అన్నట్టు ‘దళారి’ సినిమా గురించి ఒక్కవిజువల్ , ఈ సాంగ్ చాలని ప్రశంసించారు. ఈ మూవీ కూడా బలగం" లాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని కోన వెంకట్ ఆశీర్వదించారు.
హీరో సునీల్ మాట్లాడుతూ.. అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ సాంగ్ కచ్చితంగా కంటతడి పెట్టిస్తుందన్నారు. చాలా మంచి హార్ట్ టచింగ్ సాంగ్ అని.. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని ఆయన కోరారు.
డైరెక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాలలో అందరి కళ్ళముందు జరిగే అంశాల ఆధారంగా ప్రతి సన్నివేశం తీశామన్నారు. పాటలో ఉన్న ఎమోషన్‌ని మా యూనిట్ సభ్యులు ప్రతిరోజు ఫీలయ్యారని. దళారి చిత్రం కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని , ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుందని గోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ పాటను లాంచ్ చేసిన కోన వెంకట్ , సత్యం రాజేష్ , సునీల్ సహా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అతి త్వరలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
నటీనటులు : రాజీవ్ కనకాల, శకలక శంకర్, శ్రీతేజ్, ఆక్సాఖాన్, రూపిక, గిరిధర్, జెమిని సురేష్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్, రఛ్చరవి, RX 100 లక్ష్మణ్, కృష్ణేశ్వర రావు, సురేష్ కొండేటి. మ్యూజిక్ డైరెక్టర్ : హరిగౌర, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ మరియు సురేష్ గంగుల, సింగర్స్ : సాయి చరణ్ భాస్కరుని మరియు హరిగౌర, డి.ఒ.పి : మెంటం సతీష్ , ఎడిటర్ : నందమూరి హరి, కొరియోగ్రఫి రాజ్ పైడ , ఆర్ట్ : రాజ్ అడ్డాల , స్టంట్స్ : పృధ్వి, ప్రొడక్షన్ : ఆలూరి రాము మరియు రాజ వంశి, నిర్మాత : వెంకట్ రెడ్డి, రచన, దర్శకత్వం : కాచిడి గోపాల్‌రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments