'శైలజారెడ్డి అల్లుడు' తొలి గీతం 'అను బేబీ' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31 న చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రం తొలి గీతం 'అను బేబీ' ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని చిత్ర దర్శక,నిర్మాతలు తెలిపారు.
దాసరిఅరుణ్ కుమార్,గిరిబాబు,నరేష్,మురళీశర్మ,వెన్నెల కిషోర్, రఘుబాబు,పృథ్వి,మధునందన్,శత్రు,కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: గోపి సుందర్,పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,శ్రీమణి,కాసర్ల శ్యామ్,కృష్ణ కాంత్, కెమెరా: నిజార్ షఫీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఫైట్స్: వెంకట్ - దిలీప్ సుబ్బరామన్,
నిర్మాతలు: నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రచన-దర్శకత్వం: మారుతి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com