Dunki:షారుఖ్ 'డంకీ' ట్రైలర్ వచ్చేసింది.. హ్యాట్రిక్ కొడతాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న కింగ్ ఖాన్.. తాజాగా మరో సినిమా ద్వారా హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమారి హిరానీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా నటించిన 'డంకీ' సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఐదుగురు స్నేహితులు ఎలాగైనా లండన్ వెళ్లాలి అనుకుంటారు. అయితే ఇంగ్లీష్ రాకపోవడంతో వారికి వీసా రిజెక్ట్ అవుతుంది. దీంతో అక్రమంగా లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..? అనేది ట్రైలర్‌లో చూపించారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత ఇందులో కామెడీ కూడా పండించినట్లు అర్థమవుతోంది.
మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, PK, సంజు వంటి సినిమాలు తెరకెక్కించిన హిరానీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండు సార్లు రూ.1000కోట్లు కొల్లగొట్టి సూపర్ ఫామ్‌లో ఉన్నారు కింగ్ ఖాన్. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలో హై క్రేజ్ ఉంది. మరి ఈ క్రేజ్‌ను ఎంతవరకు అందుకుంటుందో డిసెంబర్ 22వరకు వేచి చూడాలి. ఇదే రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ కూడా రిలీజ్ కానుండడంతో మూవీపై మరితం హైప్ పెరిగింది.
తాప్సీ, విక్కీ కౌశల్ ఈ సినమాలో కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ ట్రైరల్ చూసిన కొంతమంది అభిమానులు, క్రిటిక్స్ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’కి ఫ్రీమేక్‌గా ఇది తెరకెక్కిందని విమర్శిస్తున్నారు. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హిరానీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. దుల్కర్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ సినిమాలో కూడా తన ప్రియురాలు కోసం హీరో దొంగతనంగా అమెరికాకి బయలుదేరి అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. ఇప్పుడు 'డంకీ'లో కూడా అమెరికా బదులు ఇంగ్లాండ్ వెళ్తున్నట్లు చూపించారు. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి షారుఖ్ ఈ ఏడాది హ్యాట్రిక్ కొడతారో లేదో వెయిట్ చేయాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com