విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్
Send us your feedback to audioarticles@vaarta.com
అర్జున్ రెడ్డి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన తెలుగు చిత్రమిది. ఈ చిత్రంతో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా మారాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అగ్ర కథానాయకుల దృష్టిలో పడ్డాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఇందుకోసం పలువురు కథానాయకుల పేర్లు పరిశీలించిన సందీప్.. బాలీవుడ్ సెన్సేషన్ రణ్వీర్ సింగ్‌ని అప్రోచ్ అయ్యాడు. రణ్వీర్ కూడా తొలుత ఈ సినిమాకి ఓకే చెప్పినా.. పద్మావతి, టెంపర్ రీమేక్ లో డార్క్ క్యారెక్టర్స్ చేస్తున్నందున మరోసారి ఆ తరహా పాత్ర అంటే.. రొటీన్ అయిపోతుందని భావించి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట.
దీంతో.. ఇప్పుడు ఈ పాత్రకి షాహిద్ కపూర్ అయితే బాగుంటుందని సందీప్ భావించాడట. అతన్ని సంప్రదించిన సందీప్‌కి షాహిద్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. ఇప్పటికే ఉడ్తా పంజాబ్‌లో డ్రగ్స్‌కి అడిక్ట్ అయిన యువకుడిగా ఆకట్టుకున్న షాహిద్.. అర్జున్ రెడ్డిలోని పాత్రలోనూ రాణిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com