తెలుగు దర్శకుడితో షారూక్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు దర్శకుడితో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ పనిచేశాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో తెలుసా? దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయడు ప్రకాష్ కోవెలమూడి. ఈయన దర్శకత్వంలో బాలీవుడ్లో కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం `మెంటల్ హై క్యా` సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ ఓ అతిథి పాత్రలో నటించాడట. అయితే అది ఏ పాత్ర అనే విషయాన్ని చిత్ర యూనిట్ రహస్యంగానే ఉంచింది. కె.ఎస్.ప్రకాష్ శ్రీమతి, కణికా థిల్లాన్ ఈ సినిమాకు కథను అందించారు. ఈ ఏడాది మార్చి 29న సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments