రీమేక్ ఆలోచనలో షారూక్
- IndiaGlitz, [Sunday,August 04 2019]
బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ తదుపరి సినిమా ఏం చేస్తాడనే దానిపై ఓ క్లారిటీ లేదు. 'జీరో' అపజయం తర్వాత షారూక్ తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ బాలీవుడ్ వర్గాల సమాచారం మేర స్పానిష్ సిరీస్'మనీ హేస్ట్' రీమేక్ ఆలోచనలో ఉన్నారట. ఈ సిరీస్ రైట్స్‌ను షారూక్ ఖాన్ తీసుకున్నట్లు తెలిసింది. బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌ను ఫీచర్ పిలింగా తీసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇందులో షారూక్ నటిస్తారా? లేక నిర్మాతగానే వ్యవహరిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత మిగిలిన వివరాలను ప్రకటిస్తారు.