శ్రీదేవి పాత్ర పై షారూక్ స్పందన..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జీరో'. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ నటించారు. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇందులో మరుగుజ్జు పాత్రలో షారూక్ నటించడం విశేషం. ఈ చిత్రంలో శ్రీదేవి అతిథి పాత్రలో నటించడం మరో విశేషం. శ్రీదేవి నటించి ఆఖరి చిత్రం కూడా జీరో.
ఈ విషయంపై షారూక్ స్పందిస్తూ.. శ్రీదేవిగారు అతిథి పాత్రలో నటించిన మాట నిజమే. ఆమె ఓ సాంగ్‌లో నటించారని చెప్పను. ఆమెది అతిథి పాత్ర అని కూడా చెప్పను. ఆ పాత్ర ఏంటో సినిమా చూడాల్సిందే.
ఆమె మా చిత్రంలో నటించడం మా అదృష్టం. ప్రపంచంలో ఆమె ఎక్కడున్నా అందర్నీ సంతోష పెట్టాలనే కోరుకుంటున్నా. 1996లో ఆర్మీ చిత్రంలో శ్రీదేవిగారితో కలిసి నటించాను. శ్రీదేవి ఉండుంటే ఆమెకే ముందుగా ఈ సినిమా చూపించేవాడిని" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com