షారూక్ లైవ్ షో...

  • IndiaGlitz, [Thursday,June 21 2018]

పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో బాలీవుడ్ హీరో హీరోయిన్స్ పెర్‌ఫార్మెన్స్ చేస్తుంటారు. ఇలా పెర్‌ఫార్మ్ చేసినందుకు వీరికి భారీ మొత్తం ముడుతుంటుంది. త్వ‌ర‌లోనే షారూక్ ఇలాంటి ఓ వేడుక‌లో లైవ్ పెర్‌ఫార్మెన్స్ చేయ‌బోతున్నారు. ఆ వేడుక ఎవ‌రిదో కాదు.. ముఖేశ్ అంబాని ఆకాశ్ అంబానిది.

ఈ నెల 30న ముంబైలో ఆకాశ్ అంబాని, శ్లోక మ‌ల్హోత్రా మ‌ధ్య నిశ్చితార్థం జ‌రగబోతుంది. ఈ వేడుక‌లోనే షారూక్ లైవ్ పెర్‌ఫార్మెన్స్ చేయ‌బోతున్నాడ‌ట‌. షారూక్‌కి ఎంత మొత్తం ముడుతుంద‌నే సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. ముఖేశ్ అంబానీతో ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగానే షారూక్ ఈ షో చేయ‌డానిక అంగీక‌రించాడ‌ట‌.