'2.0' తో షారూక్ సినిమాను చంపేస్తున్నారా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్, అక్షయ్‌కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన విజువల్ వండర్ `2.0`. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 29న విడుదలవుతుంది. అయితే ఇక్కడ రజనీకాంత్ సినిమా కారణంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్‌ఖాన్ సినిమాకు సమస్య వచ్చి పడుతుంది. అసలు సమస్య ఏంటంటే.. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారూక్‌ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరో హీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం 'జీరో'.
ఇందులో షారూక్ మరుగుజ్జు వ్యక్తిగా నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలవుతుంది. అయితే అదే రోజున కన్నడ సహా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న చిత్రం 'కె.జి.ఎఫ్'. యష్ హీరోగా నటించిన ఈ చిత్ర హక్కులను అనిల్ టాండన్ సొంతం చేసుకున్నారు. దీనికి కరణ్ జోహార్ విడుదలకు తన వంతు సహాయం చేస్తున్నాడు.
అయితే షారూక్ సినిమా అంటే భారీ విడుదల ఉంటుంది. కాబట్టి 50 శాతం థియేటర్స్‌ను కె.జి.ఎఫ్‌కు కేటాయించాలని కరణ్‌జోహార్, అనిల్ టాండన్ కండీషన్స్ పెడుతున్నారట. అలా అయితేనే `2.0`ని సదరు థియేటర్స్‌లో ప్రదర్శింప చేయడానికి అనుమతిస్తామనేది కండీషన్‌గా ఉంది. మరి షారూక్ తన సినిమా భారీ విడుదల కోసం ఏం చేయబోతున్నాడో చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout