తిలకం పెట్టుకున్న షారూక్.. ట్రోల్ చేశారు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బాద్షా.. ఖాన్ త్రయాల్లో ఒకరైన షారూక్‌ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీపావళి సందర్భంగా షారూక్ తన అభిమానులకు శుభాకాంక్షలను తెలియజేస్తుంటాడు. అలాగే ఈ దీపావళికి కూడా తన భార్య గౌరీఖాన్, కొడుకు అబ్రామ్తో కలిసి తిలకం పెట్టుకుని ఫొటో దిగాడు. దాన్ని షేర్ చేస్తూ విషెష్ చేశాడు. అయితే దీన్ని కొందరు కరుడుగట్టిన ముస్లింవాదులు జీర్ణించుకోలేకపోయారు. `నువ్వు ముస్లింవేనా. ఓ ఫొటో కోసం ఇలా తిలకం పెట్టుకుంటావా?` అంటూ నెటిజన్స్ షారూక్‌ను ట్రోల్ చేశారు.
ఈ విమర్శలపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్పందించారు. కేవలం తిలకం పెట్టుకున్నంత మాత్రాన షారూక్‌ను తప్పుడు ముస్లిం అంటూ నిందించడం సరికాదు. ప్రతి దానికీ ఓ హద్దు ఉంటుంది. మన సంప్రదాయం ప్రకరాం అందమైన తిలకం పెట్టుకున్నంత మాత్రాన ఇస్లాంకు వచ్చిన నష్టమేమీ లేదు. గంగా జమున సంగమంలోనే భారతీయ నిజమైన అందం దాగుంది అంటూ ఆమె మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అయితే ఇలాంటి విమర్శకులను ఫేస్ చేయడం షారూక్‌కి కొత్తేమీ కాదు.
#HappyDiwali to everyone. May your lives be lit up and happy. pic.twitter.com/3ppOAvhTmd
— Shah Rukh Khan (@iamsrk) October 27, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout