సోనూసూద్ కోసం షారుఖ్ ఖాన్..!
Saturday, September 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో విజయ్ తెరకెక్కించిన చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని తమిళ్ లో దేవిల్, హిందీలో టుటక్ టుటక్ టుటియా అనే టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో సోనూసూద్ నిర్మిస్తుండగా, తమిళ్ లో ప్రభుదేవా, తెలుగులో కోన వెంకట్ నిర్మిస్తున్నారు. సోనూసూద్ నిర్మిస్తున్న తొలి చిత్రమిది. సోనూసూద్ హ్యాపీ న్యూయర్ సినిమాలో షారుఖ్ తో కలిసి నటించాడు. అప్పటి నుంచి సోనూ - షారుఖ్ ఇద్దరి మంచి స్నేహం ఉంది.
ఇప్పుడు ఈ ఫ్రెండ్ షిప్ వలనే ఈ చిత్రం ట్రైలర్ కు షారుఖ్ వాయిస్ అందించారు. ఈ సందర్భంగా సోనూసూద్ ట్విట్టర్ లో స్పందిస్తూ...నిర్మాతగా నా ఫస్ట్ జర్నీలో పార్ట్ అయినందుకు షారుఖ్ ఖాన్ కి థ్యాంక్స్ అని తెలియచేసాడు. అమీ జాక్సన్, ఫరాఖాన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ లో కనిపిస్తుండడం విశేషం. ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ 7న మూడు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments