షారూక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కు తృటిలో పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకెళ్తే..షారూక్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో డ్బార్ఫ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. డ్వార్ఫ్ అంటే చిన్న లేదా పొట్టి అని అర్థం.టైటిల్‌కు తగ్గట్టుగానే షారూక్ ఈ చిత్రంలో పొట్టివాడుగా కనపడుతున్నాడు. కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మీరట్‌లో జరుగుతుంది. షూటింగ్ జరుపుకుంటున్న పై కప్పు ఉన్నట్టుండి కూలిపోయింది. అయితే ఆ సమయంలో షారూక్ సెట్ పక్కనే కూర్చొని ఉండటంతో గాయాలేమీ కాకుండా తప్పించుకున్నాడు. అయితే ఇద్దరు యూనిట్ సభ్యులు గాయపడ్డారు. వీరిద్దరినీ లోకల్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గా ఉందట. ప్రమాదం కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com