SRK, Prabhas:ప్రభాస్‌తో పోటీకి వెనక్కి తగ్గిన షారుఖ్.. 'డంకీ' విడుదల తేదీ వాయిదా..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) ఈ ఏడాది రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చి మాంఛి ఊపు మీద ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'పఠాన్'(Pathaan), సెప్టెంబర్‌లో విడుదలైన 'జవాన్'(Jawan) చిత్రాలు రూ.1000కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా విడుదల చేసి హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు కింగ్ ఖాన్. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమారి హిరానీ(RajkumarHirani) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డంకీ(Dumki) చిత్రంలో షారుఖ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉండటంతో..
అయితే ఇదే రోజున డార్లింగ్ ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్(PrashanthNeel) కాంబినేషన్‌లో వస్తున్న 'సలార్'(Salaar) మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా.. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటంతో డిసెంబర్ 22కు వాయిదా వేశారు. దీంతో ఒకే రోజు ఇద్దరి పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద వార్‌కు సిద్ధమయ్యాయి. అయితే బీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం షారుఖ్ తన సినిమా 'డంకీ'ను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే రెండు సినిమాల కలెక్షన్స్‌లో ప్రభావం పడుతుందని అనుకుంటున్నారట. అందుకే వచ్చే ఏడాది జనవరిలో 'డంకీ' విడుదల చేయాలని షారుఖ్ భావిస్తున్నట్లు పేక్కొంటున్నారు.
'సలార్' మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు..
ఇక సలార్ విషయానికొస్తే 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత వచ్చిన సాహో, రాథేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అభిమానులను నిరాశపరిచారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ మూవీపైనా హోప్స్ పెట్టుకున్నారు. అది కాకుండా ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరన శ్రుతిహాసన్(ShrutiHaasan) కథానాయికగా నటించగా, మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ (Pruthviraj Sukumaran) విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే సీనియర్ నటి శ్రియరెడ్డి(SriyaReddy) కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments