Shah Rukh Khan- Atlee: ఒంటి నిండా కట్లతో బాలీవుడ్ బాద్‌షా.. షారుఖ్-అట్లీ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా సినిమాల తాకిడితో బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులకు నచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలో అర్ధం కాక బాలీవుడ్ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో బీటౌన్ స్టార్స్ సౌత్ సినిమాలలో నటించేందుకు క్యూ కడుతున్నారు. కొందరైతే దక్షిణాది డైరెక్టర్లతో సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో తమిళ దర్శకుడు అట్లీతో ఒక సినిమా చేస్తున్నారు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అట్లీ నుంచి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఈ క్రమంలో అట్లీ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా శుక్రవారం ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ మూవీకి ‘జవాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. మొహం చుట్టూ కట్లు కట్టుకుని ఒంటి నిండా గాయాలతో.. ఒక డెన్‌లో చుట్టూ గన్స్‌తో ఉన్న టీజర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. జవాన్ మూవీని వచ్చే ఏడాది జూన్ 2న విడుదల చేయబోతున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార పోలీస్ ఆఫీసర్‌గా నటించనుంది. బాలీవుడ్ భామ సాన్య మల్హోత్రా మరో కీలకపాత్రలో నటించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు.
అట్లీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అతను తన మొదటి సినిమా ‘రాజారాణి’కి ఆయన్నే నిర్మాతగా పెట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌ను కొట్టాడు. ఆ తరువాత వరుసగా విజయ్‌తో ‘పోలీసోడు’, ‘అదిరింది’, ‘విజిల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో కోలీవుడ్ అగ్ర దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌తో సినిమా తీస్తుండటంతో అట్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments