'శభాష్ నాయుడు' కు ఎందుకిన్ని అడ్డంకులు....

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్, ర‌మ్య‌కృష్ణ‌, శృతిహాస‌న్‌లు ప్ర‌ధాన‌పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం శ‌భాష్ నాయుడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ కాలిగాయం కార‌ణంగా సెప్టెంబ‌ర్‌కు పోస్ట్‌పోన్ చేశారు. అయితే ఈ సినిమా ప్రారంభం నుండి సినిమాకు స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉన్నాయి.

నిజానికి ఈ సినిమా డైరెక్ట‌ర్ రాజీవ్‌కుమార్‌కు అమెరికాలో ఉండ‌గా సుస్తీ చేయ‌డంతో క‌మ‌ల్‌హాస‌నే ద‌ర్శ‌క‌త్వ బాద్య‌త‌ల‌ను చేప‌ట్టాడు. అయితే రీసెంట్‌గా క‌మ‌ల్ కాలికి గాయం కావ‌డంతో సినిమా తాత్కాలికంగా ఆగింది. అలాగే టైటిల్ విష‌యంలో కొంత మంది అభ్యంతరం వ్య‌క్తం చేస్తూ కోర్టుకు వెళ్ళారు. ఇలా సినిమా ప్రారంభం నుండే క‌మ‌ల్ శ‌భాష్‌నాయుడుకి అడ్డంకులు వ‌స్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో క‌మ‌ల్ బ‌ల‌రాం నాయుడు గెట‌ప్‌లో క‌న‌ప‌డ‌తారు. బ్ర‌హ్మానందం క‌మ‌ల్‌కు అసిస్టెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు.

More News

గ్రేట్ డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ తెర‌కెక్కించిన శ్రీర‌స్తు - శుభ‌మ‌స్తు 100 రోజులు ఆడాలి - డైరెక్ట‌ర్ క్రిష్

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.

నిఖిల్ ను ప‌ట్టేసుకున్నారు...

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య చిత్రాల‌తో మంచి విజ‌యాలు అందుకున్న హీరో నిఖిల్ శంక‌రాభ‌ర‌ణంతో పెద్ద డిజాస్ట‌ర్‌ను ఫేస్ చేశాడు.

ప‌వ‌న్ కు క‌లిసొచ్చిన క‌మ‌ల్ గాయం..

క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల త‌న నివాసంలో మెట్ల పై నుంచి ప‌డిపోవ‌డం...ఆత‌ర్వాత హాస్ప‌ట‌ల్ లో చేరిన విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ కాలికి ఆప‌రేష‌న్ చేసారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస్ప‌ట‌ల్ లోనే చికిత్స పొందుతున్నారు.

మ‌హేష్ బ‌ర్త్ డే కి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న మురుగుదాస్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ -  క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ఈ నెల 29నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆ న‌లుగురి క‌థే మ‌న‌మంతా - చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న‌క‌థా చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు.