భవ్య క్రియేషన్స్ 'శమంతకమణి' ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది హీరోలుగా డా: రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ "భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న "శమంతకమణి" చిత్రం పూజ కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్ కూకట్ పల్లి తులసి వనంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల క్లాప్ నివ్వగా చిత్ర నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి నటుడు డా: రాజేంద్ర ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
డా:రాజేంద్ర ప్రసాద్ మాట్లడుతూ.. "ఆనంద్ ప్రసాద్ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త అయినప్పటికి సినిమాలంటే ఎంతో ప్యాషన్. "అమ్మాయి నవ్వితే" సినిమా నుండి ఆయనతో మంచి అనుబంధం ఉంది నాకు. గతంలో ఈ బ్యానర్ నుండి మంచి హిట్స్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఎంతో సక్సెస్ తో ముందుకు వెళ్తున్న యంగ్ జెనెరేషన్ తో మల్టీ స్టారర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంత మంది యూత్ స్టార్స్ తో సినిమా చేయడం నిజంగా అభినందనీయం. ఇలాంటి మల్టీ స్టారర్ చిత్రంలో నేను చేయడం గొప్ప అనుభూతిగా ఉంది. "భలే మంచి రోజు"తో మంచి సక్సెస్ అందుకున్న శ్రీరామ్ ఆదిత్య మంచి కధ తయారు చేసాడు. ఈ సినిమాతో భవ్య క్రియేషన్స్ లో ఈ "శమంతకమణి" మరో హిట్ చిత్రంగా నిలవబోతోంది" అన్నారు.
సందీప్ కిషన్ మాట్లడుతూ.. "రోహిత్, సుధీర్, ఆది, నేను ఇలా మా అందరి కలయికలో ఈ సినిమాకి వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందులోను నా అభిమాన నటుడు రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది" అన్నారు.
ఆది మాట్లడుతూ.. "మాలాంటి యంగ్ జనరేషన్ కు తగ్గట్టు శ్రీరామ్ ఆదిత్య వండర్ ఫుల్ సబ్జెక్టు తయారు చేసాడు. ఈ సినిమాలో మేము హీరోల్లా కాకుండా క్యారెక్టర్స్ మాత్రమే కనపడేలా శ్రీరామ్ అద్భుతంగా కథను డిజైన్ చేసాడు. "లవ్లీ" తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో చేయడం ఆనందంగా ఉంది. ఒక మంచి సినిమాలో పార్ట్ అయ్యేలా నాకింత మంచి అవకాశం ఇచ్చిన ఆనంద్ ప్రసాద్ గారికి కృతఙ్ఞతలు" అన్నారు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లడుతూ.. "మొదట నేను కధ చెప్పినపుడు ఆనంద్ ప్రసాద్, నా హీరోలు చాల బావుందని అన్నపుడు సినిమా మంచి సక్సెస్ అవుతుందనిపిచింది. రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పగానే నేను చేస్తాను అన్నారు. ఇంతమంది యంగ్ స్టార్స్ తో చేయడం ఆనందంగా ఉంది" అన్నారు.
నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. "ఈ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమైన ఈ చిత్రం రేగ్యులర్ షూటింగ్ మార్చి 1నుండి ప్రారంభమవుతాయి. తప్పకుండా మా బ్యానర్ లోమరో హిట్ చిత్రం అవుతుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments