Bigg Boss 7 Telugu : ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు .. అమర్‌దీప్‌కు షాకిచ్చిన శివాజీ, సందీప్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా మూడో వారంలోకి ప్రవేశించింది. గత వారం ఇంటి నుంచి షకీలా ఎలిమినేట్ అయ్యారు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ బాగా ఎమోషనల్ అయ్యారు. టేస్టీ తేజ, దామిని, శోభా శెట్టి బాగా హర్ట్ అయ్యారు. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ షురూ అయ్యాయి. దీని గురించి కొత్తగా చెప్పేదేముంది .. నామినేషన్స్ అంటేనే గొడవలు, వాగ్వాదాలు కదా. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి మొహంపై ఫోమ్ కొట్టాలని చెప్పారు.
అయితే స్టార్టింగ్‌లోనే ప్రిన్స్ యావర్ రెచ్చిపోయాడు. నాగ్ చెప్పింది ఏమాత్రం పట్టించుకోకుండా అందరిపై కేకలు వేశాడు. ఆ తర్వాత ప్రియాంక.. ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణలను, పల్లవి ప్రశాంత్.. తేజా, దామినిలను, శోభాశెట్టి.. శుభశ్రీ, రతికలను, అమర్‌దీప్ .. గౌతమ్, శుభశ్రీలను, రతిక.. శుభశ్రీ, గౌతమ్‌లను, టేస్టీ తేజా.. పల్లవి ప్రశాంత్, గౌతమ్‌లను, ప్రిన్స్ యావర్.. ప్రియాంక, దామినిలను, దామిని.. ప్రిన్స్ యావర్, శుభశ్రీలను, గౌతమ్.. రతిక, అమర్‌దీప్‌లను, శుభశ్రీ.. టేస్టీ తేజా, ప్రియాంకలను నామినేట్ చేశారు.
మూడో వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ వున్నారు. శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, దామిని, యావర్, రతిక, అమర్‌దీప్‌లు నామినేషన్స్‌లో వున్నారు. నామినేషన్స్ ముగిశాక.. బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రాలు వుండటంతో వారిద్దరూ కలిసి ఇప్పటికే నామినేషన్స్‌లో వున్న ఓ కంటెస్టెంట్‌ను సేవ్ చేసే చేయవచ్చని చెప్పారు. దీంతో తేజను సేవ్ చేసి అమర్‌దీప్‌ను నామినేట్ చేశారు. పవర్ అస్త్ర కోసం అవకాశం ఇచ్చిన అమర్‌దీప్ ఓడిపోయాడని రీజన్ చెప్పాడు సందీప్. దీంతో ఇద్దరూ కలిసి తనను టార్గెట్ చేశాడని అమర్‌దీప్ మండిపడ్డాడు.
ఇదిలావుండగా.. బిగ్‌బాస్ హౌస్‌లో జంటల మధ్య ప్రేమలు సహజం. ఇలాంటి జంటలను ఏరికోరి సెట్ చేస్తాడు బిగ్‌బాస్. తొలి సీజన్ నుంచి నేటీ వరకు ఎన్నో జంటలు తమ రోమాన్స్‌తో ప్రేక్షకులను అలరించాయి. తాజాగా బిగ్‌బాస్ 7లో రతిక- పల్లవి ప్రశాంత్ మధ్య ప్రేమ చిగురించే అవకాశాలు పుష్కళంగా వున్నాయి. తొలి రోజు నుంచే ప్రశాంత్‌కు రతికపై ఇష్టం ఏర్పడినట్లుగా చూపించారు. రతిక కూడా ప్రశాంత్‌తో చనువుగా వుండటం మొదలుపెట్టింది. అయితే ఓసారి నామినేషన్స్ సందర్భంగా రతిక చేసిన కామెంట్స్‌తో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. అయితే చాలా రోజుల తర్వాత వీరు సరదాగా మాట్లాడుకున్నారు. ఎపిసోడ్‌లో కనిపించని ఆ వీడియోను బిగ్‌బాస్ లీక్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com