రవితేజ కోసం హైదరాబాద్‌లో దిగుతోన్న ‘‘స్టువర్ట్పురం’’ - రూ. 7 కోట్ల ఖర్చు
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ వరుసపెట్టి సినిమాలు లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఖిలాడి మూవీని రిలీజ్ చేసిన ఆయన... రామారావు ఆన్ డ్యూటీతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇది కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు రవితేజ. ‘‘రావణాసుర’’ చిత్రంలోనూ నెగిటివ్ షేడ్స్ వున్న క్యారెక్టర్ చేయనున్నారట రవితేజ. ఇకపోతే.. ఆయన ఓ బయోపిక్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాను వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆర్ మదీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 1970-80 మధ్య కాలంలో టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ఉండేవాడు. వరుస దొంగతనాలతో పోలీసులకు, ప్రజలకు నిద్రలేకుండా చేసేవాడు. అయితే, ఆయన చెడ్డ దొంగ కాదని, ఉన్నవాళ్లను దోచుకుని.. పేదలకు సాయం చేసేవాడని స్టువర్ట్పురం పరిసర ప్రాంత ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకునేవారు. అందుకే అతడిని ఇండియన్ రాబిన్ హుడ్ లేదా స్టువర్టుపురం రాబిన్ హుడ్ అని పిలిచేవారు. నాగేశ్వరరావు పోలీసుల నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకొనేవాడు. దీంతో ఆయన్ని అంతా ‘టైగర్’ అని పిలవడం మొదలుపెట్టారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు చివరికి 1987లో పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు.
'మహానటి', 'జెర్సీ', 'ఎవరు', 'శ్యామ్ సింగరాయ్' లాంటి సూపర్‌హిట్ చిత్రాలకు పనిచేసిన అవినాష్ కొల్లా ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో దాదాపు రూ. 7 కోట్ల రూపాయల ఖర్చుతో 70వ దశకంలో నాటి స్టువర్ట్‌పురంను చిత్రీకరీంచడానికి ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని 5 ఎకరాల్లో ఈ సెట్ వేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com