'మ‌హ‌ర్షి' కోసం సెట్‌

  • IndiaGlitz, [Thursday,November 01 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వినీద‌త్‌, దిల్‌రాజు, పివిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. ఈ న‌వంబ‌ర్‌లో జ‌రిగే షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌వుతుంది. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే షెడ్యూల్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది.

అందుకోసం ఓ విలేజ్ సెట్‌ను వేస్తున్నార‌ట‌. ఈ షెడ్యూల్‌లో మ‌హేశ్‌, అల్ల‌రి న‌రేశ్‌తో పాటు ఇతర ప్ర‌ధాన తారాగ‌ణం చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌బోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.