ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. కారుతో బైక్‌ని ఢీకొట్టిన సీరియల్ నటి లహరి, అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవలి కాలంలో సినీ తారలు, బుల్లితెర సెలబ్రెటీలు యాక్సిడెంట్ కేసుల్లో ఇరుక్కుని వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి.. కొన్ని సినిమాల్లోనూ అలరించిన లహరి ఓ యాక్సిడెంట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నిన్న రాత్రి హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి తన విధులు ముగించుకుని శంషాబాద్ వైపు వస్తున్నాడు. లహరి సైతం షూటింగ్ ముగించుకుని కారును తనే డ్రైవ్ చేస్తూ ఇంటికి బయల్దేరారు.
ఈ నేపథ్యంలో అతని బైక్‌ను తప్పించబోయి లహరి కారు ఢీ కొట్టింది. దీంతో బైక్‌ను నడుపుతున్న వ్యక్తి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు వెంటనే అక్కడికి దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాదం జరిగినా లహరి కారులోంచి బయటకు దిగలేదు. దీంతో వాహనదారులు, స్థానికులు ఆమెపై మండిపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు లహరిని పోలీస్టేషన్‌కు తరలించారు. అయితే ఇక ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అలాగే లహరి మద్యం సేవించిందా లేదా అని తెలుసుకునేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా చేశారు. కాగా, లహరి ప్రస్తుతం గృహలక్ష్మీ సిరియల్లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments